శృంగవరపుకోట(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్)తన మెడికల్ రియంబర్స్ మెంట్ అమౌంట్ కోసం ఒక ఫెన్సనర్ 370 రోజులు ఎదురు చూస్తే గానీ తన బాంక్ అకౌంట్ పాస్ బుక్ లో జమకాని వైనమిది... వివరాల్లోకి వెళితే( విజయనగరంజిల్లా శృంగవరపుకోట మండలకేంద్ర0 లో)) శ్రీనివాసా కాలనీ లో నివసిస్తున్న శీరాపు అచ్చియ్యమ్మ కు చెయ్యి విరిగిన కారణంగా స్థానిక ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయి0చు కున్నారు.చికిత్స కోసం తనకు రూ.లు.6,398 ఖర్చు అయి0దని ఈ మేరకు అచ్చియ్యమ్మ మెడికల్ రియంబర్స్ మెంట్ కు సంబంధించి దరఖాస్తు ను బిల్లు స్థానిక యం. ఈ.ఓ.ఆఫీస్ కు2019 జనవరి 7 వతేదీ న అందజేశానని చెప్పింది.సంబంధిత బిల్లు 2019జనవరి 17 న డి. ఇ. ఓ.ఆఫీసుకు వెళ్ళింది.సంబంధిత అమౌంట్ కోసం స్థానిక .ఎం.ఈ. ఓ.ఆఫీస్ కువెళ్లి అడగ్గా డి.ఈ. ఓ.ఆఫీస్ వారు తమకు ప0ప లేదని చెప్పారని సమాధానం చెప్పారని ,డి.ఈ. ఓ.ఆఫీస్ కు వెళ్లి తనకుమారుడు శ్రీనివాసరావు అడిగితే డి.యం. అండ్ హెచ్ .ఓ.ఆఫీస్ వారు తమకు పంపలేదని అన్నారనిచెప్పారు.దా0తో తనకుమారుడు .2019ఫిబ్రవరి 3వ తేదేన జిల్లా కలెక్టర్ వారి వ్యధ విభాగంలో తనసమస్య పరిష్కరించ మని ఫిర్యాదులు చేసారని చెప్పారు.తనకు రు.లు.6,398 ఖర్చు అయితే చివరకు 545 రూపాయలు మాత్రమే 2020 జనవరి22 వతేదేన తన పాస్ బుక్ లో జచేసారని అచ్చియ్యమ్మ చెప్పారు. 370 రోజులు ఎదురు చూస్తేగానీ అమౌంట్ రాలేదని చెప్పారు. మన ప్రభుత్వ శాఖల్లో సిబ్బంది పనితీరు ఎలావుందో ఈసంఘటనే మంచి ఉదాహరణ అని,ఇటువంటి విధానాలకు స్వస్తి పలకాలని అమెఅన్నారు. జిల్లాలో అన్ని ఎం. ఈ. ఓ.ఆఫీస్ వద్ద ఫిర్యాదుల బాక్స్ లు యార్పాటు చెయ్యాలని.అందులో వచ్చిన ఫిర్యాదు లను వె ను వెంటనే పరిష్కరించాలని ఆమె జిల్లా అధికారులను కోరారు
"370 రోజులు ఎదురు చూస్తే గాని అందని అమౌంట్ "