పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలి ప్రజాశక్తి పుస్తక ప్రదర్శనలో ఐసిడిఎస్ పీడీ రాజేశ్వరి ప్రజాశక్తి-విజయనగరం కోట బాలలు పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలని ఐసిడిఎస్ పీడీ ఎం.రాజేశ్వరి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్‌టిసి కాంప్లెక్సు ప్రాంగణంలోని ప్రజాశక్తి బుకహేౌస్ వద్ద ఏర్పాటు చేసిన పిల్లల పుస్తక ప్రదర్శనను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాలబాలికల్లో పుస్తక పఠనం తగ్గుతోందని అన్నారు. దీనివల్ల వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానం లోపించే ప్రమాదం ఉందన్నారు. పుస్తక పఠనంతోనే మనోవికాసం సాధ్యమవుతుందని, అందుకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఇందుకోసం ప్రజాశక్తి బుకహేౌస్‌లో విరివిగా పుస్తకాలు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ఈ పుస్తకాలపై ఇస్తున్న 40శాతం రాయితీని వినియోగించుకోవాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర సభ్యులు కేసలి అప్పారావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి కోసం ప్రజాశక్తి ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్నారుల మేథోశక్తి పెంచేందుకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ప్రజాశక్తి శ్రీకాకుళం ఎడిషన్ మేనేజర్ పి.కామినాయుడు (గణేష్) మాట్లాడుతూ ప్రజాశక్తి కేవలం వార్తలు, ప్రజా సమస్యల వెలికితీతకే పరిమితం కాకుండా సమాజాభివృద్ధికి దోహదపడే పుస్తకాలను అందుబాటులో ఉంచుతుందని అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజాశక్తి బుకహేౌస్‌లలో రాయితీపై పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ఉపయోగపడే 150 రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజాశక్తి జిల్లా కన్వీనర్ కె.రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది, విలేకర్లు పాల్గొన్నారు. title>
• seerapu sreenivaas rao