ఏప్రిల్ 15 నుంచి రైళ్ల పునరుద్దరణ.. సిద్ధంగా ఉండండి: రైల్వే జోన్లకు ఆదేశాలు




దేశంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిచెందకుండా దేశవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేశారు. కేవలం సరుకు రవాణ రైళ్లు తప్ప ప్రయాణికులు రైళ్లు నిలిచిపోయాయి. కేంద్రం విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా... ఏప్రిల్ 15 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. రైల్వే భద్రత సిబ్బంది, రన్నింగ్ స్టాఫ్, గార్డ్స్, టీటీఈలు సహా ఇతర అధికారులు ఏప్రిల్ 15 నుంచి విధుల్లో చేరాలని ఆదేశాలు అందినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి మంత్రుల బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే రైల్వే సర్వీసులు ప్రారంభమవుతాయి.
ఇదిలా ఉండగా, రైళ్ల షెడ్యూల్, వాటి ఫ్రీక్వెన్సీ తదితర అంశాల గురించి అన్ని జోన్లకు పునరుద్ధరణ ప్రణాళికను రైల్వే శాఖ జారీ చేసింది. రైలు సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉండాలని దేశంలోని 17 జోన్లకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. రాజధాని, శతాబ్ది, దురంతో సహా దాదాపు 80 శాతం రైళ్లు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితోపాటు లోకల్ రైళ్లు కూడా నడపనున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం సూచనలతో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను రైల్వే శాఖ నిర్వహించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 14 వరకు రైళ్లు నిలిపివేయాలని గతంలో ఆదేశాలు జారీచేశారని, కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఉన్నతాధికారులు తెలిపారు. కాబట్టి ఏప్రిల్ 15 నుంచి రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని అన్నారు. అయితే, రైలు సర్వీసుల పునరుద్దరణపై స్పష్టమైన కార్యాచరణను వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉందన్నారు.

మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్యాసింజర్ రైళ్లను మార్చి 24 నుంచి నిలిపివేశారు. దీంతో మొత్తం 13,523 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు స్టేషన్లకే పరిమితమయ్యాయి.



 



Popular posts
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
విలేకర్లకు నిత్యావసరాల పంపిణీ
అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ నీ కలిసిన అయ్యా రక యువజన సంక్షేమ సంఘం సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇందులో అయ్యారక కార్పొరేషన్ ఉంది అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ సతీమణి రాజేశ్వరి కి కేటాయించారు ఆమెకు అభినందనలు తెలపడానికి విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం పరిధి కొత్తవలస ప్రాంతానికి చెందిన అయ్యారక యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలిసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యారక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రీ శ్రీను అయ్యారక సంక్షేమ సంఘం అధ్యక్షులు బంగారు రమేష్ ప్రధాన కార్యదర్శి కర్రీ దేవుడు బాబు కోశాధికారి లంక ఈశ్వర్ రావు ఉపాధ్యక్షులు దన్నిన రవి కుమార్ పెదిరెడ్ల శ్రీను వాసు అధికార ప్రతినిధి పెదిరెడ్ల పాత్రుడు సహాయ కార్యదర్శి పేదరెడ్ల రాజేష్ లంక నరసింహారావు లంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Image
జాతీయ పత్రికా దినొీత్సవం సందర్బంగా డా..బి.ఆర్.అంబేద్కర్ యుానివర్సటి లొీ వైస్ చాన్సలర్ డా..కుాన రాంజీ గారు,జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి యల్.రమేష్ గారు,మీడియా జె.ఎ.సి.కన్వనర్ యస్.జొీగినాయడు గారు మరియు ప్రొఫసర్స్ చేతుల మీదగా చీరు సత్కరం...జరగింది
Image
పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలి ప్రజాశక్తి పుస్తక ప్రదర్శనలో ఐసిడిఎస్‌ పీడీ రాజేశ్వరి ప్రజాశక్తి-విజయనగరం కోట బాలలు పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలని ఐసిడిఎస్‌ పీడీ ఎం.రాజేశ్వరి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్‌టిసి కాంప్లెక్సు ప్రాంగణంలోని ప్రజాశక్తి బుకహేౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన పిల్లల పుస్తక ప్రదర్శనను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాలబాలికల్లో పుస్తక పఠనం తగ్గుతోందని అన్నారు. దీనివల్ల వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానం లోపించే ప్రమాదం ఉందన్నారు. పుస్తక పఠనంతోనే మనోవికాసం సాధ్యమవుతుందని, అందుకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఇందుకోసం ప్రజాశక్తి బుకహేౌస్‌లో విరివిగా పుస్తకాలు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ఈ పుస్తకాలపై ఇస్తున్న 40శాతం రాయితీని వినియోగించుకోవాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర సభ్యులు కేసలి అప్పారావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి కోసం ప్రజాశక్తి ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్నారుల మేథోశక్తి పెంచేందుకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ప్రజాశక్తి శ్రీకాకుళం ఎడిషన్‌ మేనేజర్‌ పి.కామినాయుడు (గణేష్‌) మాట్లాడుతూ ప్రజాశక్తి కేవలం వార్తలు, ప్రజా సమస్యల వెలికితీతకే పరిమితం కాకుండా సమాజాభివృద్ధికి దోహదపడే పుస్తకాలను అందుబాటులో ఉంచుతుందని అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజాశక్తి బుకహేౌస్‌లలో రాయితీపై పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ఉపయోగపడే 150 రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజాశక్తి జిల్లా కన్వీనర్‌ కె.రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది, విలేకర్లు పాల్గొన్నారు. title>
Image