<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
• seerapu sreenivaas rao