<no title>*కొత్త ప్రెస్ అక్రిడేషన్ల జారీ లో విఫలమైన సమాచార శాఖ.పొడిగింపు తో పెద్దగా ప్రయోజనం లేదు*. రాష్ట్రంలో జర్నలిస్టులకు కొత్త ప్రెస్ అక్రిడేషన్స్ జారీ చేయటంలో సమాచార శాఖ పూర్తిగా విఫల మైంది.గత సంవత్సరం డిసెంబర్ చివర నాటికి గడువు ముగిసిననాటి నుండి పొడిగించు కుంటూ పోతున్నారు.అడిగే వారు లేనట్లు, గత నెలైతే అదికూడా లేకుండా చేశారు . రెండు వారాల లోగా అక్రిడేషన్లు ఇవ్వాలని హై కోర్టు ఆదేశించడంతో కోర్టు వాయిదాకు రెండు రోజుల ముందు, కోర్టు ధిక్కార భయంతో నవంబర్ 1న ,ఆదివారం సెలవు దినమై నప్పటికీ మరో మూడు నెలలు పొడిగిస్తూ మెమో విడుదల చేశారు.నిజానికి రెండు వారాల లోగా జారీ చేయలేదు కాబట్టి ఇది కూడా కోర్టు ధిక్కార మే అవుతుంది.పొడిగింపు వల్ల పెద్ద గా ప్రయోజనం లేదు.కొత్త వాటితోనే జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డులు,ప్రమాద బీమా ,స్థానిక పత్రికలు యాడ్స్,తదితర వాటిని ముడి పెట్టారు. కొత్తవి రాకుండా ఏవేవి సాధ్యం కాదు .పైగా పొడిగించడం వల్ల కొత్తగా అర్హత సాధించిన వారు వాటిని కోల్పోతున్నారు .సంస్థలు మారిన వారికి ఈ పొడిగింపు వర్తింప చేయటం లేదు . అనర్హులను తొలగిస్తామంటూ , అర్హులకు కూ డా అక్రిడేషన్స్ లేకుండా చేయటం దారుణం. హెల్త్ కార్డులు,ప్రమాద బీమా కు ఆర్థిక శాఖ నుండి క్లియరెన్స్ వచ్చినా వాటి కొనసాగింపు ప్రక్రియ ప్రారంభించ లేదు.జర్నలిస్టుల పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలి......పి.సత్యనారాయణ,ఎడిటర్,మనభూమి దిన పత్రిక,cell9642575844
• seerapu sreenivaas rao