సాలూరు:విజయనగరం జిల్లా ,సాలూరు పట్టణ0 లోని గొల్ల వీధి కి చెందిన ఒక వృద్ధుడు ని చిల్లంగి నెపం తో హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గొల్ల వీధికి చెందిన బొబ్బిలి అప్పయ్య (80)కనిపంచడం లేదని ఆయన కుటింబికులు 2020,అక్టోబర్ 9న పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తు0డగా మంగళవారం సాయంత్రం ఆప్పయ్య సవమై ఒరిస్సా లోని సుంకి ప్రాంతంలో కనిపించాడు. బుధవారం సి. ఐ. సింహాద్రి నాయుడు అందించిన వివరాల ప్రకారం ఆప్పయ్య ను చిల్లంగి నెపంతో ఆయన బందువులే ఈ హత్య చేసినట్లు నిర్ధారణ అయి0ది
అక్టోబర్ 8న అల్లు కుమార్ అనే వ్యక్తి అప్పయ్యను పి.కోనవలస తీసుకెళ్లి మరికొంతమంది కి అప్పగించాడు.వారు కార్ లో అప్పయ్య ను తీసుకెళ్లి హత్య చేసినట్లు సి.ఐ. సింహాద్రి నాయుడు తెలిపారు. హంతకు ల కుమార్తె కు అప్పయ్య చిల్లంగి పెట్టాడని ఆ అనుమానం తో అప్పయ్యను హత్య చేసి నట్టు సి.ఐ. చెప్పారు.ఈ కార్యక్రమంలో టౌన్ యస్.ఐ. ఫక్రుద్దీన్ వున్నారు