నిరుపేద క్రీడా కారినికి దాతల వితరణ శృంగవరపుకోట పట్టణంలో మరో క్రీడా ఆణిముత్యం తయారవబోతుంది ,నిరుపేద కుటుంబంలో జన్మించిన ముంజేటి రేవతి బ్యాడ్మింటన్ కోర్ట్ లో కదలికలను గమనించిన కోచ్ పొట్నూరు శ్రీరాములు ఆమె ఆటను దాతల ముందు ప్రదర్శించాడు ఆటను చూసి మంత్ర ముగ్ధులై ఆఅమ్మాయికి ఏమిటి అవసరం అని కోచ్ శ్రీరాములు నిఅడిగి వెంటనే అవి ఎర్పాటుచేయాలని అంబటి స్వామినాయుడు 1500/- రూ,,రెండుజతల క్రీడాదుస్తులను,ఎల్.జి. స్పోర్ట్స్ యజమాని దేముడు 2000/- రూ రాకెట్ ,ఎమ్.హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ 1500-/రూ ,,,బ్యాడ్మింటన్ బూట్లను, గోవిందరావు (గవర్నమెంట్ జూనియర్ కళాశాల లెక్చరర్)1000/- రూ,, క్రీడాదుస్తులు ,స్నేహా స్వచ్చంద సంస్థ అధ్యక్షకార్యదరుసులు ఎ. ఎస్. వెంకటరావు ,మంథా సుబ్బారావు లు రేవతి భవిష్యత్ లో పాల్గొన బోయే టోర్నమెంట్స్ కు పూర్తి సహాయసహకారములు అందిస్తామన్నారు .ప్రస్తుతం రేవతి చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు వద్ద శిక్షణ పొందుతుంది . బుధవారం ఉదయం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కిడాకారుల మధ్య దాతలు క్రీడాకారిని రేవతికి క్రీడాదుస్తులు, రాకెట్, బూట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు మంథా సుబ్బారావు ,హరిప్రసాద్,గోవిందరావు ప్రకాష్,తిరుపతిరావు,అంబటి స్వామినాయుడు ,ఆంజనేయులు,ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.
• seerapu sreenivaas rao