"ఆ రచనలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి"ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పత్రికా రంగంలో విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను జాతీయ స్థాయిలో ఇనుమడింప జేసిన మహనీయులు సర్ సీ.వై.చింతామణి అని "ఉదయరాగ౦ "పత్రిక సంపాదకులు మోపాడ మరియదాసు అన్నారు.బాపూజీ సేవా సంఘం ఆధ్వర్యంలో చింతామణి వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో మరియదాసు మాట్లాడుతూ భారత రాజకీయ పత్రికా రంగంలో చింతామణి సేవలు మరపురాని వన్నారు. పెద్దగా చదువుకోపోయి నా అనేక ఆంగ్ల పత్రికలలో ఆయన చిన్నవయసులోనే వ్యాసాలు రాశారని,చదువు కునే రోజుల్లో జాతీయ ఉద్యమాల వైపు ఆకర్షితులై దేశసేవకై పత్రికా రంగాన్ని ఎన్నుకున్నారని ఆదిశలో అడుగులు వేశారని ది తెలుగు హార్స్ అనే ఆంగ్ల పత్రికకు ,విశాఖపట్నం నుండి వెలువడే వైజాగ్ సెక్టార్ పత్రికకు సంపాదకులు గావుండి తన సేవాలందించారని స్వా తంత్ర్య పోరాట సమయంలో తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచారని మరియదాసు అన్నారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర లీడర్ సంపాదకులు కాకి వీరారెడ్డి, ప్రజలు కోరే స్వేచ్ఛ సంపాదకులు శీరాపు శ్రీనివాసరావు,స్వేచ్ఛ కలం సంపాదకులు చింతా వెంకట రమణ మూర్తి, నవతరం దిన పత్రిక విలేకరి గుండపు కృష్ణా రావు స్టార్స్ సంచాలకులు మోపాడ చిన్నికృష్ణ, జగన్నాధ రావు,గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వీరు సర్ సి వై చింతామణి చిత్ర పాఠాని కి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు
• seerapu sreenivaas rao