*జర్నలిస్ట్ కుటుంభా లను సీఎం ఆదుకోవాలి*(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్): ఆంధ్రప్రదేశ్ లో 1980 జనవరి ఒకటో తేదీ నుండి ఇప్పటి వరకు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని జనజాగృతి సేవా సంస్థ ఉత్తరాంధ్ర కన్వీనర్ శీరాపు శ్రీనివాసరావు ఒక ప్రకటన లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కోరారు.ఆంధ్రా వాయిస్ దినపత్రిక కు శృంగవరపుకోట మండలంలో విలేకరి గాపనిచేసిన చొక్కాకుల లక్ష్మణరావు విజయవాడలో జరిగిన ట్రైన్ ప్రమాదం లో2013,అక్టోబర్18 న మరణించారని తెలిపారు.అలాగే లక్కవరపుకోట మండంలో ప్రజాశక్తి, విశాఖా సమాచారం పాత్రికేయులు మరణించగా,గంట్యాడ మండలంలో విశాలాంధ్ర విలేకరి,లక్కవరపు కోట మండలంలో విజయభాను విలేకరి, ,కొత్తవలస మండలంలో విశాఖసమాచారం విలేకర్లు మరణించారని ఆయన ఆప్రకటనలో తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సి.యం. ని కోరారు
<no title>