శృంగవరపుకోట.(. ప్రజలు కోరే స్వేచ్ఛ. న్యూస్.): ఆంధ్రప్రదేశ్ తేదీ.1.1.1980 నుండి తేదీ.30.06.2020 వరకూ చేతబడి హత్యలకు (మూఢనమ్మకాలకు ఎందరు బలైపోయారో)ఎందరు మరణించనారో మొదలగు విషయాలు పై ప్రభుత్వం వాలంటియర్,వి.ఆర్.ఓ. లచే సర్వే జరిపించి ఆయా వివరాలను ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ లో ఉంచాలని జన జాగృతి సేవా సంస్థ ఉత్తరాంధ్ర కన్వీనర్ శీరాపు శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఓ పత్రికా ప్రకటన లో కోరారు.అలాగే నరబలులకు ఎందరు గురైనారో మొదలగు వివరాలపై కూడా సర్వేలు జరపాలని ఆంధ్రప్రదేశ్ లో "మూ ఢ నమ్మకాల చట్టం "చేయాలని కోరారు ప్రతీ గ్రామ0 లో ప్రజా చైతన్య సమావేశాలు, సదస్సులు పెట్టి ప్రజలిని చైతన్య పరచాలని సి.యం. ను కోరారు
ఆంధ్రప్రదేశ్ లో మూఢనమ్మకాల నిరోధక చట్టం అమలు చెయ్యాలి