*నీలం సంజీవరెడ్డికి నివాళి* శృంగవరపుకోట(ప్రజలుకోరేస్వేచ్ఛ న్యూస్):స్థానిక బాపూజీ సేవ సంఘం ఆధ్వర్యంలో నీలం సంజీవరెడ్డి 24 వ.వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు .ఈకార్యక్రమంలో టి.డి.పి.నాయకులు కే.మల్లేశ్వరరావు మాట్లాడుతూ నాటి ప్రజా నాయకులు విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారని అన్నారు. నీలం సంజీ వరెడ్డి ముఖ్యమంత్రి గావున్నసమయం లో బస్ రూట్లు వ్యవహారం లో ప్రభుత్వం కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం తో తనపదవికి రాజీనామా చేసి విలువలనుకాపాడిన విశిష్టత గల వ్యక్తి అని ఆయన అన్నారు . అంతకుముందు వీరు సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో సంస్థ వ్యస్థా పాకులు మోపాడ మరియదాసు,పిరిది సింహాచలం, వసంత సత్యారావు,మోపాడ చిన్ని కృష్ణ, యం. గంగాధర్,బి.స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు
• seerapu sreenivaas rao