మగ్గంఉన్న అందరికీ సాయం."(ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్): నేతన్న ఆత్మీయ నేస్తం పథకం కింద ప్రభుత్వం మగ్గం ఉన్న అందరికీ (ప్రతీ చేనేత కార్మికునికి ఏడాదికి రూ.24 వేలు సాయం చేయాలని నిర్ణయించిందని జోలి శాఖా ఏ.డి. పెద్దిరాజు చెప్పారు.ఇందులో భాగంగా జిల్లా లో లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ పక్కాగా పూర్తి చేశామని మగ్గంవున్నచెనేత కుటుంభా ల్లో 423 మందిని అర్హులు గా గుర్తించామని కుటుంబం లోఒకరికి మాత్రమే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు.గతేడాది డిసెంబర్ లో ఈ పథకం కింద ఆర్ధిక సాయం అందించామని ఈ ఏడాది సుమారు ఆరు నెలల ముందే సాయం అందుతోంది కారోనా నేపథ్యంలో చేనేత కార్మికులు ఉపయోగపడుతోందన్న ఉద్దేశ్యం తో ప్రభుత్వం ముందే ఈ ఆర్ధిక సాయం వారి ఖాతాల్లో జమ చేస్తోందని పెద్దిరాజు చెప్పారు .జిల్లాలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా చీపురుపల్లి లో 73 మంది లబ్ధిదారులకు గాను రూ.17,52,000, నెల్లిమర్ల లో 52 మందికి రూ.12,48,000,విజయనగరం ఒక లబ్ది దారు నికి రూ.24,000, శృంగవరపుకోట లోఒక లభి దారునికి రూ.24,000 లు,బొబ్బిలి లో190 కి రూ.45,60,000,సాలూరు లో12మందికి రూ.2,88,000, కురుపాం లో17 కి రూ.4,08,000,పార్వతీపురం లో77 మందికి రూ.18,48,000,ఇవ్వటం జరిగిందని మన జిల్లాలో 423 మంది లభిదారులకు గాను రూ.1,01,52,000 లు అందిస్తామని చెప్పారు
• seerapu sreenivaas rao