కాళీ0గెడ్డ ఆక్రమణ లు తొలిగించాలి.భోగి రమణ డిమాండ్ :(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్): కలింగెడ్డ ఆక్రమణలు తొలిగించాలని 550 ఎకరాల కు సాగు నీరు అందేలా చూడాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ భోగి రమణ అన్నారు.భాగిరమణ ఆధ్వర్యంలో పలువురు రైతులు శృంగవరపుకోట తసీల్ధార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. మొన్నానుకురిసిన వర్షం వల్ల గెడ్డనేరు ఇళ్లలోకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని అన్నారు,10 స0.గా గెడ్డ ఆక్రమణ వల్ల ప్రజలు రైతులు ఇబ్బంది పడుతుంటే పాలకులకు చీమకుట్టి నట్టయినా లేదని అన్నారు. పది రోజుల్లో గా సమస్య ను పరిష్కరించక పోతే సమస్య పరిష్కారానికి పై అధికారులు దృష్టి లో పెట్టి పోరాటం చేస్తామని అన్నారు. అనంతరం వినతిపత్రం ను రెవెన్యూశాఖ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పి.మణిబాబు ,హెచ్.నానాజీ,సీ తం నాయుడు, బంగారం, గోపి,మురళి,రైతులు అంబటి అప్పారావు, గనివాడ రాములు,అప్పల నాయుడు,చిమ్మి తవుడు తదితరులు పాల్గొన్నారు
• seerapu sreenivaas rao