*ఆదమరిస్తే అంతేమరి* శృంగవరపుకోట (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):స్థానిక పట్టణ0 లోపలు వీధుల్లో విద్యుత్ స్తంభాలకు అమర్చిన ఫుజ్ బాక్స్ లకు రక్షణ కావచాలు లేవు దాంతో ఏక్షణాన ఎవరికి విద్యుత్ షాక్ తో మృత్యువాత పడతారో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫోటో లో ఉన్న బాక్స్ ఎరుకుల వీధి లో ఉన్న విద్యుత్ బాక్స్ దుస్థితి ,అలాగే శ్రీనివాసా కాలనీ లో పిరిడి సింహాచలం ఇంటివద్ద ,విశాఖ -అరుకు రోడ్డు లో శివప్రియ హోటల్ కు ఎదురుగా ఉన్న విద్యుత్ స్థంభ0కు,వెంకటేశ్వరా డీ లక్స్ సినిమా హాల్ ప్రక్కనఉన్న స్థంభం కు ప్రభుత్వ జూనియర్ కళాశాలవద్ద ,పుణ్యగిరి రోడ్ లోను,దేవీ గుడి జుంక్షన్ నుండి సీతంపేట వెళ్లే రోడ్ లోను ,జి. సి.సి.రోడ్ లోను ఉన్న విద్యుత్ స్తంభా లకు ఉన్న బాక్స్ లకు రక్షణ కావచాలు లేవు అందువల్ల సంభదిత అధికారులు తగుచర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. పశువులు,ప్రజలు మృత్యువాత పడకముందే తగు చర్యలు తీసుకుంటా రని ఆశిద్దాం
• seerapu sreenivaas rao