విజయనగరం(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్)
జిల్లా నుండి వెళ్ళేందుకు ఈ పాస్ ఆన్లైనులోనే దరఖాస్తు చేసుకోవాలి • విజయనగరం జిల్లా ఎస్పీ బి . రాజకుమారి , ఐ . పి . ఎస్ . . . విజయనగరం నుండి వెళ్ళేందుకు ఈ పాస్ మంజూరు కొరకు ఇకపై ఆన్లైనులోనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీమతి బి . రాజకుమారి తే . 10 - 05 - 2020 ది . ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు . జిల్లా ఎస్పీ శ్రీ మతి బి . రాజకుమారి మాట్లాడుతూ - విజయనగరం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు ఈ - పాస్ మంజూరు కొరకు ఎవ్వరూ 6309898989 కు వాట్సాప్ చేయనవసరం లేదని , అదే విధంగా జిల్లా పోలీసు కార్యాలయాన్నికి సుదూర ప్రాంతాల నుండి రానవసరం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు . ఇందుకుగాను రాష్ట్ర డిజిపి కార్యాలయంలో ఒక వెబ్ సైటును ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు . రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలనుకొనేవారు . https://serviceonline.gov.in/epass/ ను సంప్రందించాలన్నారు . ఈ వెబ్ సైటులో ప్రయాణించే వ్యక్తి పూర్తి పేరు , ఫోను నంబరు , ఫోటో , గుర్తింపు కార్డుగా డ్రైవింగు లైసెన్సు , పాస్పోర్టు , ఓటరు గుర్తింపు కార్డు , పాన్ కార్డు , ఆధార్ కార్డులను చూపవచ్చునన్నారు . ఈ వెబ్ సైటులో ప్రయాణించే వ్యక్తి ఎక్కడి నుండి ఎక్కడకు ప్రయాణిస్తున్నా డన్న విషయాన్ని , ప్రాయాణానికి గల కారణాన్ని , ప్రయాణించే వాహనం వివరాలను పొందిపర్చాలన్నారు . వివరాలను పూర్తి చేసిన తరువాత పొందిపర్చిన వివరాలన్నియూ నిజమని , స్వంత డిక్లరేషను ఇవ్వవలసి ఉంటుందన్నారు . అనంతరం , సంబంధిత దరఖాస్తు ఏ జిల్లా నుండి ప్రయాణిస్తే ఆ జిల్లా ఎస్పీగార్కి వస్తుందని , క్యూఆర్ కోడ్ సహాయంతో పెర్మిషను పొందవచ్చునని జిల్లా ఎస్పీ తెలిపారు . అదే విధంగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళబోయే వారి దరఖాస్తు ఫారంలను రాష్ట్ర డిజిపి కార్యాలయంకు పంపబడి , అక్కడ నుండి అనుమతులు వస్తాయని జిల్లా ఎస్పీ శ్రీమతి బి . రాజకుమారి ఒక ప్రకటనలో తెలిపారు .
<no title>