*రోడ్ల పైకి వస్తే కఠిన చర్యలు :ఎస్పీ బి.రాజకుమారి.* విజయనగరం.(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్)కోవిడ్ -19 నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీరోజు రాత్రి 7 గంటలనుండి మరుసటి రోజు ఉదయం 7 గంటలవరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నా యని ,ఈ సమయంలో రోడ్డు పైకి వచ్చేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ బి.రాజ కుమారి హెచ్చరి0చారు. జిల్లాలో లాక్ డౌన్ అమలు ను ఆమె సోమవారం పర్యవేక్షించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు అన్ని షాప్ లు తెరుచు కోవచ్చు నని అన్నారు. కర్ఫ్యూ సమయ0 లో అత్యవసర వైద్య అవసరాల మినహా, ప్రజలెవరూ రోడ్లు పైకి రావదన్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా రోడ్లు పైకి వస్తే వాహనాలు స్వాధీనం చేసుకుంటామన్నారు. వారిపై జాతీయ విపత్తు ల నిర్వాహణ చట్ట0, ఎ పిడిమిక్ డిసీ జెస్ చట్టం,ఐ పి సి సెక్షన్ ల కింద కేస్ నమోదు చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్.పి. రాజకుమారి హెచ్చరించారు. ప్రజలంతా పోలీస్ శాఖ కు సహకరించాలని కోరారు
<no title>