విజయనగరం..(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్).. మెరుగైన సేవలు అందించే సచివాలయ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరింత కృషి అవసరమని వార్డు కార్యదర్శులకు స్థానిక శాసనసభ్యులు, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు.
ప్రజలకు ఉత్తమ సేవలు అందించి, అవినీతి రహిత సమాజం ఏర్పరచాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో పరిపాలన మరియు మౌలిక వసతుల కల్పన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. వినతిపత్రాన్ని కార్యదర్శులు సమర్పించారు. అనంతరం శాసన సభ్యులు కోలగట్ల మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నివారణ ,నియంత్రణ చర్యలలో భాగంగా కార్యదర్శులకు కొంత అదనపు పనిభారం ఏర్పడిందని,కోవిడ్ సమస్య తీరిన వెంటనే సచివాలయ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజాసేవలు మరింత చేరువచేసేందుకే సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. కరోనా నియంత్రణ చర్యలలో సచివాలయ వ్యవస్థ చేస్తున్న కృషిలో భాగంగా రాష్ట్రంలో మన నగరపాలిక నాలుగో స్థానంలో నిలవడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. అదే విధంగా నగర పాలక సంస్థ ఆర్థిక పరిపుష్టికి చేయూత అందించాల్సిన బాధ్యత కూడా కార్యదర్శులదే నని అన్నారు. ఇప్పటికే 6 కోట్ల రూపాయల మేర కుళాయి కనెక్షన్ బకాయిలు ఉన్నాయని, వాటిని గుర్తించి ఇంకా నమోదు కాని నీటి పన్ను వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ మాట్లాడుతూ ప్రజలకు 61 ప్రజా ఉపయోగ సేవలను అందివ్వడానికి సచివాలయ వ్యవస్థ రూపొందించబడిందని చెప్పారు. సమావేశంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు,ఈ ఈ దిలీప్,డి.ఈ. నర్సింగరావు, ఆశపు వేణు, ఎస్ వి వి రాజేష్, కనకల ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.
<no title>