లెక్కవరపుకోట:(ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్): లక్కవరపుకోట మండలం లో గల గోల్డ్ స్టార్ పవర్ ప్లాంట్ కంపినీ లో ఆదివారం ఉదయం సుమారు 11.30.12 గంటల సమయంలో లాక్ డౌన్ అనంతరం ప్రారంభించేందుకు ప్లాంట్ శుభ్రపరిచే పనుల్లో భాగంగా లక్కవరపుకోట మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన కాటపల్లి రామరాజు 35 సంత్సరాల ప్లాంట్ ఉద్యోగి తన విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా పై భాగంలో ఉన్న బూడిద తన పై పడటం తో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు గత ఆరేడు సంత్సరాలుగా ఇదే కంపినీ లో బోయిలర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు . ఇతనిపై తన ముసలి తల్లి తండ్రులు తో పాటు భార్య ఇద్దరు చిన్న ఆడపిల్లలు కూడా ఆదారిపడి బ్రతుకుతున్నారు.
ఇంటిళ్ల పాది ని పోషించే పెద్ద దిక్కు ఆకస్మాతుగా మరనినిచతంతో వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.
మృతదేహాన్ని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసపత్రికి పోస్ట్ మార్టరం నిమిత్తం తరలించారు.
లక్కవరపుకోట పోలీసులు ఘటనను దర్యాప్తు చేస్తున్నారు.
కార్మికుడు మృతి.