*ఘనంగా జ్ఞానీ జైల్ సింగ్ జయంతి* :శృంగవరపుకోట (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్)స్థానిక బాపూజీ సేవా సంఘం ఆధ్వర్యంలో జ్ఞానీ జైల్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకుడు మోపాడ మరియదాసు మాట్లాడుతూ జ్ఞానీ జైల్ సింగ్ ఉన్నత మైన ఆదర్శాలతో సమర్ధవంతంగా ఐదు సంవత్సరాలు రాష్ట్రపతి గాచేసిన మహానీయులని కొని యాడారు. ఈయన స్వాతంత్ర్య సమరం లో పాల్గొని జైలు జీవితం గడిపారని, పంజాబ్ ముఖ్యమంత్రి గా నూ ,కేంద్ర హోంమంత్రి గానూ రాష్ట్రపతి గా తన సేవలను దేశానికి అందించారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో చిన్ని కృష్ణ, బాలి అప్పలనరసయ్య, దాడి రాజు,వసంత రాము, రమేష్,నానిగిరి శ్రీను గనివాడ దేముడు పాల్గొన్నారు .
• seerapu sreenivaas rao