ఉరి వేసుకొని బాలుడు మృతి
లక్కవరపుకోట మండలం లోని పోతం పేట గ్రామానికి చెందిన లంక ప్రదీప్(10) అనే బాలుడు శుక్రవారం ఉదయం సుమారు పది గంటలకు పశువుల పాక ఉరి వేసుకొని చనిపోయాడు. తాతగారి ఇంటి వద్ద ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. తాత అయినా పి. చిన్న అప్పారావు మందలించారని కోపంతో ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రాణం ఉందేమో నని లక్కవరపుకోట ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు ఎస్ కోట హాస్పిటల్ కి పెంచారు ఆస్పత్రికి చేరుకునేసరికి బాలుడి ప్రాణం పోయింది. ఎస్ కోట సి హెచ్ సి బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అప్పగిస్తామని తెలిపారు లక్కవరపుకోట పోలీసులకు తెలిపారు.