* రహదారి విస్తరణ కు కృషి.* కొత్తవలస(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):పెందుర్తి నుండి శృంగవరపుకోట వరకు రాష్ట్ర రహదారిని నాలుగు వరదల జాతీయ రహదారిగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తున్నట్టు విశాఖపట్నం యం. పి. యం. వి.వి.సత్యనారాయణ, యం. యల్.ఏ.కడుబండి శ్రీనివాసరావు లు తెలిపారు. రామలింగపురం లో విలేకరులతో వారు మాట్లాడుతూ లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే రూ.10 కోట్ల అంచనాలతో రోడ్డు అభివృద్ధి పనులు మొదలవుతాయని చెప్పారు.కొత్తవలస రైల్వే గేట్ స్థానంలో ప్రతి పాదిత ఆర్ యూ బీ నిర్మాణం గురించి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి నట్టు, రెండురోజుల్లో పనులు మొదలు కానున్నట్లు చెప్పారు
పెందుర్తి-శృంగవరపుకోట రహదారి విస్తరణకు కృషి