మధ్య నిషేధం అమలు చేయాలి :భారత నాస్తిక సమాజం డిమాండ్.: గాజువాక (ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్):మద్య నిషేధం అమలుచేయాలని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు తుంపాల శ్రీరామ మూర్తి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. కారోనా లాక్ డౌన్ తేదీ.22.03.2020 న ప్రారంభ మైనప్పటినుండి మద్యం అమ్మకాలు నిలిపేసారని ఫలితంగా మద్యం తాగే అలవాటు ను ప్రజలు మరిచిపోయారని అన్నారు. ప్రజల సంక్షేమం ను ఉల్లంఘించి న రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలనాల్గో తేదీ నుండి మద్యం అమ్మకాలు ప్రారంభించింది అని అన్నారు.మద్యం ఆదాయ వనరుగా ప్రభుత్వం అమలు చేయడం రాజ్యాంగ విరు ద్ధమని మద్యం వల్ల కుటుంభాలు ఛిద్రమవుతాయని ,నేరాలు ప్రమాదాలు జరుగుతాయని ఆలాగే గృహ హింసలు పెరుగుతాయని అందువల్ల మద్యంనిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 6,7,8, తేదీల్లో గృహ దీక్షలు చేస్తున్నామని ఆయన అన్నారు ఈరోజే గృహ దీక్ష లు ప్రారంభించామని భారత నాస్తిక సమాజ0 రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ మూర్తి చెప్పారు .ఫోటో రైటప్.గాజువాక (జోగవాని పాలెం)లోని తన స్వగృహం లో దీక్ష చేస్తున్న తుంపాల శ్రీరామ మూర్తి.
• seerapu sreenivaas rao