* ఘనంగా నీలం సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు: * శృంగవరపుకోట (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):స్థానిక బాపూజీ కమ్యూనిటీ హాల్ లో బాపూజీ సేవా సంఘం ఆధ్వర్యంలో నీలం సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపకులు మోపాడ మరియదాసు మాట్లాడుతూరైతు కుటుంబ0 లో జన్మించిన ఈ తను రాజకీయ నాయకులో మంచి పేరుప్రఖ్యాతులు పొందా రని ,నేటితరానికి ఆదర్శనియ్యుడని అన్నారు. ఇతను చిన్న తనం లొనే సత్యాగ్రహం ఉద్యమం లోపాల్గొని జైలు జీవితం గడిపారని 1959 నుండి 1962 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా పనిచేశారని బస్ రూట్ల జాతీయ కరణ విషయం లో ప్రభుత్వం కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో తన పదవి వదులుకున్నారని,కేంద్ర మంత్రి వర్గంలో పలు కీలకమైన పదవులు చేశారని అన్నారు. 1967 లో లోక్ సభ స్పీకర్ గా తదుపరి దేశ రాష్ట్రపతి గా సేవలందించారని మరియదాసు అన్నారు. ఈ కార్యక్రమంలో రొంగలి అప్పల నాయుడు,వసంత సత్యా రావు,మోపాడ చిన్ని కృష్ణ, మోపాడ అరుణ కుమారి,అప్పలరాజు ,గోవిందా తదితరులు పాల్గొన్నారు
• seerapu sreenivaas rao