మద్యం నిషేధం అమలు చేయాలి.భారత నాస్తిక సమాజం డిమాండ్. విశాఖపట్న0.(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):మధ్యనిషేధం అమలు చేయాలని భారత నాస్తిక సమాజ0 విశాఖపట్నం జిల్లా గౌరవాధ్యక్షులు వై.నూకరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు అతను గృహ దీక్ష చేశారు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 6,7,8 తేదీల్లో గృహ దీక్షలు చేస్తున్నామని చెప్పారు.మాధవదారిలో నితన స్వగృహంలో (నాస్తిక నిలయం లో) దీక్షలు చేస్తున్నామని చెప్పారు.కారోనా లాక్ డౌన్ ప్రారంభం (తేదీ.22.3.2020)నుండి మద్యం అమ్మకాలు నిలిపేసారని ఫలితంగా మద్యం త్రాగటం అలవాటు ను ప్రజలు మరిచిపోయారని చెప్పారు. ప్రజల సంక్షేమం ను ఉల్లఘించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నాలుగో తేదీ నుండి మద్యం అమ్మకాలు ప్రారంభించింది అని నూకరాజు చెప్పారు .దీనివల్ల కుటుంబాలు ఛిద్రమవుతాయని అన్నారు .మద్య నిషేధం అమలు చేయాలని ,ప్రజల మేలు కోరి మద్యం నిషేధం అమలు చెయ్యాలి అనిఅన్నారు.
• seerapu sreenivaas rao