రాష్ట్రంలోని జర్నలిస్టులకు 50లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి నున్న ట్లు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణహామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం విజయనగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర కార్యదర్శి పి. ఎస్.ఎస్.వి.ప్రసాదరావు (శివ) ప్రత్యేకంగ కలిసారు.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ పరిస్థితుల్లో జర్నలిస్టు లు ఎదుర్కొంటున్న సమస్యల్ని మంత్రి దృష్టికి ప్రసాద్ తీసుకెళ్లారు. ప్రాణాలకు తెగించివార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులకు దేశంలోని కొన్ని రాష్ట్రాలు కల్పిస్తున్న బీమా సౌకర్యం గురించి మంత్రికి వివరించారు. దీనికి స్పందించిన మంత్రి ఈ విషయం తన దృష్టిలో ఉందన్నారు. ముఖ్యమంత్రి తో మాట్లాడి కృషి చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.
<no title>