లారీ డ్రైవర్ ఆత్మ హత్య...
వెస్ట్ గోదావరి: జిల్లా ఉంగుటూరు మండలం బాదంపుడికి చెందిన మట్టా సూరయ్య ఫైనాన్స్ లో లారీ తీసుకుని తానే సొంతంగా నడుపుకుంటూ, తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లాక్ డౌన్ నెల దాటిపోయింది. ఇంకో నెల రోజులు గడువు పొడిగించే అవకాశం ఉండడంతో, అటు కుటుంబ సమస్యలు, ఇటు లారీ తీసుకున్న అప్పు, చుట్టుపక్కల వారిముందు ఎలా ఫీల్ అయ్యాడో ఏమో పాపం...
వెంటనే ఆలస్యం చేయకుండా తన సొంత లారీకి తానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత నెల అంటే ఆటపాటల మీద గడిచిపోయింది. అది కూడా ఒక పక్క దిగులు ఉన్నా పెద్దగా లెక్క చేయలేదు.
కానీ ఇంకో నెల మాత్రం పూర్తిగా కఠినంగానే ఉంటుందని గ్రహించి, వెంటనే అతనికి దిగులు మొదలైంది. ఇంకెలా ఉండబోతోందో ..
ఊహిస్తే కరోనా కంటే ఇదీ భయంకరంగా ఉందని ఆత్మ హత్య చేసుకున్నాడు.