*శాస్త్రీయ దృక్పదాన్ని అలవర్చుకోవాలి* లక్కవరపుకోట.(ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్) :మూఢనమ్మకాలు లేని గ్రామాలు అవతరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టా లని జనజాగృతి సేవా సంస్థ ఉత్తరాంధ్ర కన్వీనర్ శీరాపు శ్రీనివాసరావు ఓప్రకటనలో తెలిపారు.విజయనగరం జిల్లా కొమరాడ మండలం చోళ్ళ పదం పంచాయతీ కునేరు గ్రామానికి చెందిన నిమ్మక సోమేశ్వర రావు కు 18 నెలల కుమార్తె ఉందని ఆమె అనారోగ్యంతో మరణిస్తే ఆ పాపకు కొందరు చిల్లంగి పెట్టారని అందువల్లే చనిపోయి0దని ,సింగన్న అనే వ్యక్తి చిల్లంగి పెట్టినందువల్లే తన కుమార్తె చనిపోయి0దని భావించిన గ్రామస్తులు సింగన్న పై దాడి చేశారని శ్రీనివాసరావు ఆప్రకటనలో పేర్కొన్నారు. దాడిచేసినందున సింగన్న మరణించాడని ఈ దాడిని ఖండిస్తున్నా నాని తెలిపారు. సింగన్న మరణం పై పత్రికలలో వార్తలు వచ్చాయని తెలిపారు,ఈ ఘటన పై పోలీస్ లు విచారణ జరిపి బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. చిల్లంగి పేరిట దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా అధికారులను కోరారు.మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో చైతన్య సభలు పెట్టి చైతన్య పరచాలని, హేతు వాది బి.సాంబశివరావు రాసిన* సత్యశోధన* పుస్తకం లోని 20 కథలను వీధి నాటికలుగా ప్రభుత్వం రూపొందించి ఇబ్బడిముబ్బడిగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో ప్రదర్శి0చా లని శీరాపు శ్రీనివాసరావు ప్రభుత్వం ను కోరారు.వి.ఆర్.ఓ. లు గ్రామ పంచాయతీ కార్యదర్సుల తో ప్రత్యేక సర్వే నిర్వహించి1980 జనవరి ఒకటో తేదీ నుండి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ లో మూఢనమ్మకాల వలలో పడి మృతి చెందిన వారి(ఫోటోలు తో)వివరాలను అంతర్జాలంలో ప్రవేశపెట్టాలని శ్రీనివా సరావు ఆప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.ప్రజలకు శాస్త్రీయ్య దృక్పథం అలవర్చుకోవర్చు కోడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కోరారు
<no title>