*ఆరోగ్య శాఖా మంత్రి అటెండర్ కు పాజిటివ్* అమరావతి (ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్).ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేషీ లో పనిచేసే అటెండర్ కు మంగళవారం నిర్వహించిన ట్రూనాట్ పరీక్షలో ప్రి జ0పిటివ్ పాజిటివ్ వచ్చింది. తుది నిర్ధారణ కు నమూనాను వైరాలజీ లాబ్ కి (ఆర్టీ పీసి ఆర్ పరీక్ష లకు)పంపారు.అటెండర్ ను పిన్నమనేని సిద్దా ర్ధ వైద్య కళాశాల కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి నాని,ఆయన భద్రతా సిబ్బంది ,పేషీలోని మిగతా అధికారులు , ఉద్యోగులు కలిసి మొత్తం 12 మందికి పరీక్షలు చేశారు. మంగళవారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో వారందరికీ నెగిటివ్ వచ్చింది. వైరాలజీ లాబ్ ప్రొఫెసర్ రత్న కుమారి తెలిపారు
<no title>