- స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులకు నిత్యావసర వస్తువులు పంపిణీ
- మరువలేనిది కాటూరి రవీంద్ర దాతృత్వం
- పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా..డీసీపీ రంగారెడ్డి చేతుల మీదుగా జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు అందజేత
విశాఖపట్నం, ఏప్రిల్ 9
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది...పేద,ధనిక అనే తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు...ప్రతీ నిమిషం ప్రజల సమస్యలను, కరోనా బారిన పడకుండా ప్రభుత్వం అందిస్తున్న సూచనలను ఎప్పటికప్పుడు పత్రికలు,టీవీల్లో తెలియజేస్తూ కుటుంబాలను వదిలి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా ఎవరినీ సహాయం అడగని పరిస్థితి.. ఈ నేపద్యంలో కరోనా పరిస్థితుల్లో జర్మలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిసిన స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ , కాటూరి సూరన్న చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్,పారిశ్రామిక వేత్త కాటూరి రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు...దీంతో ఆయన ముందుకు వచ్చి స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు..బుధవారం సిటీ పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా..డీసీపీ రంగారెడ్డి ల చేతుల మీదుగా జర్నలిస్టులకు పంపిణీ గావించారు...ఈ సందర్బంగా సీపీ ఆర్కే మీనా మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల అజాగ్రత్ర,నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్నారు..లాక్ డౌన్ వరకు ప్రజలు ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకొని అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలి కోరారు..ఇతర రాష్ట్రాలు,దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు...కరోనా నేపథ్యంలో పేద,మధ్యతరగతి ప్రజల సమస్యలతో పాటుగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి నిత్యావసర వస్తువులు అందించిన కాటూరి రవీంద్ర పలువురికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు..కాటూరి రవీంద్ర లాగానే పలువురు దాతలు ముందుకు వచ్చి కరోనా కాటీ ణ్యంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు సహాయం అందివ్వాలని కోరారు..అనంతరం డిసీపీ రంగారెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ మొదలు కొని నేటి వరకు అనేక మంది దాతలు ముందుకు వచ్చి సేవా తత్పరతను చాటుకొని కరోనా ఈతి బాధల నుంచి అనేక మందిని బయటపడేస్తున్నారని అన్నారు..అందులో కాటూరి రవీంద్ర ఒకరని అన్నారు...జర్నలిస్టులను ఆదుకోవడానికి ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటుగా ఇంకా అనేక మందిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్న కాటూరి రవీంద్ర సేవలు మరువలేనివని కొనియాడారు..ఈ కార్యక్రమంలో ఈస్ట్ ఏసీపీ ...టూటౌన్ సిఐ శ్రీనివాసరావు...స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు నాగనబోయిన నాగేశ్వరరావు...బిఎస్ చంద్రశేఖర్..ఎస్వీబీ కుమార్ ...అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్...కార్యదర్శి కర్రి సత్యన్నారాయణ.. ఉపాధ్యక్షులు అజయ్ కుమార్..రిషికేశ్...కోశాధికారి అశోక్ రెడ్డి..సహా కార్యదర్సులు కాళ్ళ సూర్య ప్రకాష్..రాజారావు..సభ్యులు విజయకుమార్...శరత్...వినోద్...రాజేష్...