"నిరు పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ" విశాఖపట్నం(ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్):భారత నాస్తిక సమాజం ,స్థానిక యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో 2020,ఏప్రిల్,23 న నిరు పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేసామని భారత నాస్తిక సమాజం విశాఖపట్నం జిల్లా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. లాక్ డౌన్ కారణంగా అనేకమంది పేదలు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారని భా.నా.స. ప్రతినిధి జె.రామ్ ప్రభు ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లో 150 మంది పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత నాస్తిక సమాజం సభ్యులు డి.విజ్ఞాన0ద్, రాంప్రభు, యన్ .బి. మూర్తి తదితరులు పాల్గొన్నారు.ఫొటో రైటప్.ఆహార పొట్లాలు అందజేస్తున్న భారత నాస్తిక సమాజం ప్రతినిధి,సభ్యులు
నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ