మార్చి 23 వరకు ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణకు 2.20 లక్షల మంది.. రైల్వే వెల్లడి

దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఢిల్లీలోని నిజాముద్దీన మర్కజ్ ప్రార్థనలు కారణమయ్యాయి. మార్చి 1 నుంచి 15 వరకు జరిగిన తబ్లీగ్ జమాత్ సమ్మేళనానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. గడచిన నాలుగు రోజుల్లో దాదాపు 2,000 కేసులు నమోదుకాగా, 70 శాతం మంది వీరే ఉన్నారు. ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్లివచ్చినవారితోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అయితే, ఈ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిలో కొంత మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.


దీంతో మరింత ఆందోళన మొదలైంది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వారిని పూర్తిస్థాయిలో గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ నుంచి రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు వచ్చినవారి జాబితాను దక్షిణ మధ్య రైల్వే అందజేసింది. తబ్లీగ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొనవారిని గుర్తించడానికి ప్రస్తుతం ఈ జాబితా కీలకంగా మారింది.

మర్కజ్‌ సమ్మేళనం మార్చి 1 నుంచి 15 వరకు జరిగింది. ఈ నేపథ్యంలో మార్చి 11 నుంచి 23 వరకు ఢిల్లీ నుంచి వచ్చిన అన్ని రైళ్ల సమాచారం కావాలని దక్షిణ మధ్య రైల్వేను తెలుగు రాష్ట్రాల అధికారులు కోరారు. దీంతో ఆ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చిన 2.20 లక్షల మంది పేర్లు, సెల్‌ నంబర్‌, చిరునామాలను సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (క్రిస్‌) అధికారులు అందజేశారు. తెలంగాణ, ఏపీ పరిధిలోని రైల్వే స్టేషన్లలో దిగిన ప్రయాణికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు.

అలాగే, ముంబయి, పుణె, నాగ్‌పూర్‌ తదితర స్టేషన్లలో దిగిన ప్రయాణికుల సమాచారాన్ని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా రైల్వేశాఖ అందించిన జాబితా ఆధారంగా ఇప్పటివరకు క్వారంటైన్‌లోకి వెళ్లని వారిని గుర్తించే పనిని ముమ్మరం చేసినట్లు తెలంగాణకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

అయితే, తబ్లీగ్ జమాత్‌కు వెళ్లొచ్చినవారిలో ఎంతమంది దొరకలేదన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. తెలంగాణ నుంచి మొత్తం 1,030 మంది తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి వెళ్లి రాగా వారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 603 మంది, జిల్లాలకు చెందిన వారు 427 మంది ఉన్నారు. జిల్లాల వారిలో కరోనా లక్షణాలు ఉన్న వారిని చికిత్సకు, లేనివారిని క్వారంటైన్‌కు తరలించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల మాత్రం మిగిలిపోయిన వారి కోసం గాలింపు జరుగుతూనే ఉంది. ఏపీలోనూ దాదాపు 1,000 మంది ఢిల్లీకి వెళ్లొచ్చారు.


Popular posts
రామ రాజ్యాన్ని తలపిస్తో0ది.యం. యల్.ఏ.కడు బండి శ్రీనివాసరావు
<no పేద క్రీడాకారులకు దాతల వితరణ శృంగవరపుకోట ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ లో ఆదివారం బాలల దినోత్సవం సందర్భాగా శిక్షణ పొందుతున్న సీనియర్ గ్రూప్ క్రీడాకారులకు డబుల్స్ టోర్నమెంట్ నిర్వహించినట్లు చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు తెలిపారు. ఈ టోర్నమెంట్ లోగెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ఇవ్వడానికి సోమవారం ఉదయం ముఖ్యాతిధులుగా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుకూరి రఘురాజు , ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు డా,,ఎస్ వి సత్యాశేఖర్,స్నేహస్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు లు వచ్చారు ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ నిరుపేద క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,వారి స్తితి గతులగురించి వివరిస్తూ వీరందరూ క్రిడల్లో మేటి - ఆర్ధికంగా వెనుకబాటు అని చెప్పగానే స్పందించి, వెంటనే 10,000/-రూ విలువచేసే( బ్యాట్లు,షూ,క్రీడాదుస్తులు,షటిల్ కాక్స్ మొ,,) క్రీడాపరికారాలను దాతలు అందజేశారు .ఎస్. కోట జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగంచేస్తున్న కందుల కృష్ణ నీరజ కి1000/- బ్యాట్ ,మౌనిక కి 800/-రూ క్రీడాదుస్తులను,అలాగే స్నేహ స్వచ్చంద సేవా సంస్థ కార్యదర్శి మంతా సుబ్బారావు హరీష్ కి1500/-రూ క్రీడా బూట్లు ,వైజాగ్ కి చెందిన సన్ రైజ్ స్పోర్ట్స్ యజమాని ప్రసాద్ 3000/-రూ విలువచేసే లీనింగ్ బ్యాట్ అందించారు.నీరజ ,బి.హారిక ,మహాలక్ష్మి ,హేమంత్ లకు 2000/-రూ విలువచేసే క్రీడాదుస్తులను ఇందుకూరి రఘురాజు సమకూర్చారు.2000/- షటిల్ కాక్స్ ను డా,ఎన్. సూర్యనారాయణ, కందుల కృష్ణ లు అందజేశారు.ఈ టోర్నమెంట్ కు బహుమతులను డా,ఎస్. వి.సత్యాశేఖర్,ఎ. ఎస్. వెంకటరావు లు సమకూర్చారు. టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులు సిద్దార్ద్ /వి.మనోహర్ జంట ప్రధమ, బి.హారిక/ రవి జంట ద్వితీయ స్థానాలు సాధించారని,ఉత్తమ క్రీడాకారుడిగా K. సాయి సాహిత్ నిలిచారు వీరికి రఘురాజు,సత్యాశేఖర్,వెంకటరావు ,కృష్ణ ల చేతులమీదుగా బహుమతులు అందించారని శ్రీరాములు తెలిపారు .ఈ కార్యక్రమంలో కోచ్ Md అస్లాం , Ch. నాయుడు ,కిడాకారుల పాల్గొన్నారు.
Image
పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలి ప్రజాశక్తి పుస్తక ప్రదర్శనలో ఐసిడిఎస్‌ పీడీ రాజేశ్వరి ప్రజాశక్తి-విజయనగరం కోట బాలలు పుస్తక పఠనంపై ఆసక్తి చూపాలని ఐసిడిఎస్‌ పీడీ ఎం.రాజేశ్వరి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్‌టిసి కాంప్లెక్సు ప్రాంగణంలోని ప్రజాశక్తి బుకహేౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన పిల్లల పుస్తక ప్రదర్శనను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాలబాలికల్లో పుస్తక పఠనం తగ్గుతోందని అన్నారు. దీనివల్ల వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానం లోపించే ప్రమాదం ఉందన్నారు. పుస్తక పఠనంతోనే మనోవికాసం సాధ్యమవుతుందని, అందుకు అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. ఇందుకోసం ప్రజాశక్తి బుకహేౌస్‌లో విరివిగా పుస్తకాలు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ఈ పుస్తకాలపై ఇస్తున్న 40శాతం రాయితీని వినియోగించుకోవాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర సభ్యులు కేసలి అప్పారావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి కోసం ప్రజాశక్తి ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్నారుల మేథోశక్తి పెంచేందుకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. ప్రజాశక్తి శ్రీకాకుళం ఎడిషన్‌ మేనేజర్‌ పి.కామినాయుడు (గణేష్‌) మాట్లాడుతూ ప్రజాశక్తి కేవలం వార్తలు, ప్రజా సమస్యల వెలికితీతకే పరిమితం కాకుండా సమాజాభివృద్ధికి దోహదపడే పుస్తకాలను అందుబాటులో ఉంచుతుందని అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజాశక్తి బుకహేౌస్‌లలో రాయితీపై పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ఉపయోగపడే 150 రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజాశక్తి జిల్లా కన్వీనర్‌ కె.రమేష్‌నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది, విలేకర్లు పాల్గొన్నారు. title>
Image
<no"స్నేహ"ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శృంగవరపుకోట స్నేహ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 11 వతేది బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు అట్లూరి శ్రీ వెంకటరావు తెలిపారు . సోమవారం ఉదయం పి.ఆర్. షటిల్ కోర్ట్ ఆవరణలో నిర్వహించిన స్నేహ స్వచ్చంద సంస్థ సర్వసభ్యసమావేశంలో సంస్థ రాబోయే రెండునెలలలో చేయతలపెట్టిన కార్యాక్రమాలగురుంచి చర్చించడం జరిగింది .ఈనెలలో 6వ తేదీన మామిడిపల్లి (ఎస్.కోట)లో కరోనా (కోవిడ్-19) పై ప్రజల్లో చైతన్యం తేవడానికి ఒక కార్యక్రమం, అలాగే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా రక్తసేకరణ అవసరం ఉందిఅని ఈనెల 11వ తేదీన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేయాలని సభ్యులందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నట్లు వెంకటరావు తెలిపారు .ఈ సందర్భంగా ఈనెల 21,22 తేదీలలో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు నిర్వహించిన ఉత్తరాంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ పోటీలలో పి.ఆర్.షటిల్ కోర్ట్ సభ్యులు ద్వితీయ స్థానం సాధించి 30 వేల రూపాయలు ,కప్పు సాధించారు వారిని స్నేహ స్వచ్చంద సంస్థ,మరియు పి.ఆర్. షటిల్ కోర్ట్ సభ్యులు అధ్యక్షకార్యదర్సులు వెంకట్రావు,సుబ్బారావు ,చీఫ్ కోచ్ పొట్నూరు శ్రీరాములు సభ్యులు రామకృష్ణ, గంగాభవని,డా,,వేణు ,డా ,,వరలక్ష్మి ,ప్రకాష్,మురళి,శ్రీను ,రాజు,తిరుపతిరావు ఇతరసభ్యులు అభినందించారు. title>
Image
అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ నీ కలిసిన అయ్యా రక యువజన సంక్షేమ సంఘం సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇందులో అయ్యారక కార్పొరేషన్ ఉంది అయ్యారక కార్పొరేషన్ చైర్మన్ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ సతీమణి రాజేశ్వరి కి కేటాయించారు ఆమెకు అభినందనలు తెలపడానికి విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం పరిధి కొత్తవలస ప్రాంతానికి చెందిన అయ్యారక యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలిసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అయ్యారక కార్పొరేషన్ డైరెక్టర్ కర్రీ శ్రీను అయ్యారక సంక్షేమ సంఘం అధ్యక్షులు బంగారు రమేష్ ప్రధాన కార్యదర్శి కర్రీ దేవుడు బాబు కోశాధికారి లంక ఈశ్వర్ రావు ఉపాధ్యక్షులు దన్నిన రవి కుమార్ పెదిరెడ్ల శ్రీను వాసు అధికార ప్రతినిధి పెదిరెడ్ల పాత్రుడు సహాయ కార్యదర్శి పేదరెడ్ల రాజేష్ లంక నరసింహారావు లంక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Image