హైదరాబాద్ నగరాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. హాట్ స్పాట్లలో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అధికారుల వెన్నులో చలి పుట్టిస్తోంది. నియంత్రణా చర్యలు నగరంలో పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని పకడ్బందీ చర్యలకు ఆదేశించారు. ముఖ్యమంత్రి సీరియస్ కావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.
రాజధాని పరిధిలోని సైబరాబాద్‌లో 39 కంటైన్‌మెంట్ జోన్స్ గుర్తించారు. ఈ జోన్స్‌కు రాకపోకలను పూర్తిగా నిషేధించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలానగర్, మాదాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లను గుర్తించారు. అల్వాల్, అస్మక్‌పేట్, జీడిమెట్ల అపూర్వకాలనీ, ధర్మారెడ్డికాలనీ, తుర్కపల్లి, కళావతినగర్, గచ్చిబౌలి, అయ్యప్ప సొసైటీ, ఇజ్జత్‌నగర్, హఫీజ్‌పేట్‌లో ఈ కంటైన్‌మెంట్ జోన్లున్నాయి.