(గరుగుబిల్లి : ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్) విజయనగరం జిల్లా గరుగుబిల్లిమండలంలోని లఖణాపురం గ్రామంలో గల ఓ కుటుంబ0 లో అన్నీ అంకుశాలే . లఖణాపురం గ్రామాల్లో రైతు బాంధవులనే బిరుదాంకితులు ముదిలి బాబు పరాంకుశం ఇంట్లో తన కుమారులందరికీ వారి పేర్లు చివర 'అంకుశం'అనే పేరు వచ్చేలా నామకరణం చేశారు. పరాంకుశం 1909 అక్టోబర్ 15న జన్మించారు.ఇతను అహర్నిష లు రైతుల సంక్షేమం కోసం కృషి చేసారు.2012 జనవరి 2 వ తేదీన అనారోగ్యకారణంగా మరణించారు. పరాంకుశం గారికి ఏడుగురు కుమారులు .వారందరి పేర్లు చివర అంకుశ0 అని వచ్చేలా మొదటి కుమారుడు పేరు దానవాంకుస0.,రెండోకుమారుడు కాండవా0కుశ0,మూడో కుమారునికి మాదవా0కుశం, నాల్గవ కుమారునికి భార్గవా0కుశ0,ఐదవ కుమారునికు తరుణవా0కుశం, ఆరవకుమారునికి విజయవాంకుశం ,ఏడవ కుమారునికి కరుణవా0కుశం గా పేర్లు పెట్టడం విశేషం గా అనేకమంది అనుకుంటారు
"ఆకుటుంబ0 లో అన్నీ అంకుశా లే"