నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు మరణ శిక్ష అమలు మరోసారి వాయిదా పడింది.
దీంతో మార్చి 3న శిక్ష అమలుచేయాలని పటియాలా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు సాధ్యం కాదు.నిర్భయ దోషులను ఉరి తీయాలని పటియాలా కోర్టు ఇప్పటివరకూ మూడుసార్లు డెత్ వారెంట్ జారీ చేసింది.ఈ నలుగురు దోషుల పేర్లు ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా.అంతకు ముందు కోర్టు జనవరి 22న వీరి ఉరిశిక్ష తేదీని ఖరారు చేసింది. కానీ ఒక దోషి దయాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగులో ఉండడంతో ఉరిశిక్ష తేదీని వాయిదా వేశారు.తర్వాత కోర్టు ఫిబ్రవరి 1న వీరికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. కానీ ఆరోజు కూడా ఉరిశిక్ష విధించలేకపోయారు. దానిని తదుపరి ఆదేశాల వరకూ నిలిపివేశార.ఆ సమయంలో, నిర్భయ తల్లి ఆశా దేవి కోర్టు నలుగురు దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.ఈసారి నిందితులకు ఉరిశిక్షను విధిస్తారని, చట్టపరమైన లొసుగుల నుంచీ వారికి ఎలాంటి ప్రయోజనం లభించదని ఆశాభావం వ్యక్తం చేశారు.కానీ, దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ.. తమ క్లయింట్ల దగ్గర ఇప్పటికీ చట్టపరమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పారు.