కొన్నేళ్లుగా రాజకీయాల్లో బిజీ అయిపోయిన సినీ హీరో పవన్ కల్యాణ్ మళ్లీ తెరపై ఇలా కనిపించబోతున్నారంటూ ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌పై ప్రచురించింది.
''పవన్ కల్యాణ్ తెరపై కనిపించక రెండేళ్లు పైనే అయ్యింది. 'అజ్ఞాతవాసి' తర్వాత ఆయన రాజకీయాలతో బిజీ అయిపోయారు. మళ్లీ పవన్‌ని తెరపై ఎప్పుడు చూస్తామా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న క్రమంలోనే అనూహ్యంగా కొత్త సినిమాల్ని ప్రకటించేశారు.ఆయన చేస్తున్న రెండు చిత్రాల్లో ఒకటి 'వకీల్ సాబ్'. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్'కి రీమేక్‌గా రూపొందుతోంది. శ్రీరామ్ వేణు దర్శకుడు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. బోనీకపూర్ సమర్పిస్తున్నారు.సినిమా పేరుతో కూడిన ఫస్ట్‌లుక్‌ని సోమవారం విడుదల చేశారు. కళ్లజోడు ధరించి, పుస్తకం చేతపట్టుకుని మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు పవన్.ఆయన ఇందులో న్యాయవాదిగా కనిపించబోతున్నారు. పవన్ శైలి మాస్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేలో విడుదల చేస్తారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నార''ని అందులో వివరించారు.