ఈశాన్య దిల్లీలో అల్లర్లు చేయించేందుకు ముస్లింలకు కొందరు డబ్బులు పంచుతున్న దృశ్యాలంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ఏదో భవనంపై నుంచి తీసినట్లుగా ఉంది.
కొందరు మహిళలు లైన్‌లో నిలబడి, డబ్బులు తీసుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా డబ్బులు తీసుకుంటుండటం కనిపించింది.మన్‌దీప్ టోకాస్ అనే పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో దీన్ని షేర్ చేశారు. దిల్లీలో హింస రేగడానికి ముందు, డబ్బులు పంచుతున్నప్పుడు తీసిన వీడియోగా దీన్ని పేర్కొన్నారు32 వేలకుపైగా మంది ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. ఐదు లక్షలకుపైగా మంది ఈ వీడియోను చూశారు.ఇలాంటి వ్యాఖ్యలతోనే మరికొందరు కూడా ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో, ఇతర సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేశారు.